loader

AI సంచలనం.. ఫస్ట్ ఏఐ మూవీ

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని షేక్‌ చేస్తున్న తరుణంలో, ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి AI సినిమా కన్నడలో వచ్చింది. ఈ ‘లవ్ యూ’ అనే సినిమాను కేవలం 10 లక్షలతో AI ద్వారా రూపొందించడం విశేషం. దర్శక నిర్మాత నరసింహ మూర్తి, AI నిపుణుడు నూతన్ తప్ప నటన, సంగీతం, పాటలు, నేపథ్య సంగీతం, డబ్బింగ్ అన్నీ AIతోనే చేశారు. 95 నిమిషాల సినిమా:  “95 నిమిషాల నిడివి గల సినిమాలో 12 పాటలున్నాయి. సెన్సార్ బోర్డు సభ్యులు […]

అదొక అదృష్ణం.. రజినీ ‘కూలీ’పై ఉపేంద్ర

రజినీకాంత్ కూలీ చిత్రంలో చాలా కేమియోస్ ఉన్నాయని అర్థం అవుతోంది. రజినీకాంత్ మెయిన్ హీరో అయినా కూడా నాగార్జున, ఆమిర్ ఖాన్ వంటి వారు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఈ గెస్ట్ అప్పియరెన్స్ లిస్టులో ఉపేంద్ర కూడా చేరిపోయాడు. కూలీలో ఆమిర్ ఖాన్ నటిస్తున్నాడని కూడా టీం ప్రకటించలేదు. కానీ ఉపేంద్ర మాత్రం అన్నింటినీ కన్ఫామ్ చేసేశాడు. కూలీ చిత్రంలో తాను నటిస్తున్నానని ఓపెన్‌గా చెప్పేశాడు.అసలు సిసలు పాన్ ఇండియా మూవీ అనిపించుకునేందుకు అన్ని ఇండస్ట్రీల హీరోల్ని […]

పెద్ద మనసు చాటుకున్న బ్యూటీ

హీరోయిన్ తాప్సీ పన్ను గొప్ప మనసు చాటుకుంది. దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో గుడిసెల్లో ఉండే పేదలు ఎంత ఇబ్బంది పడతారో ఊహించింది తాప్సీ. అందుకే తన వంతు సాయంగా కొందరికి కూలర్లు, ఫ్యాన్స్ పంచింది. ఈ వేసవి నుంచి ఉపశమనం అందించేందుకు ముంబయి మురికివాడల్లో నివసిస్తున్న కొంతమంది పేదలకు టేదలకు ఫ్యాన్లు, మినీ కూలర్లు అందించింది ఈ భామ. భర్త మథియాస్ బోతో కలిసి ఈ ఛారిటీ కార్యక్రమంలో పాల్గొంది.

పవన్ కళ్యాణ్‌ను కలిసిన అల్లు అర్జున్.. మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న బన్నీ

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను అల్లు అర్జున్ కలిశారు. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఇటీవలే అగ్నిప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో పవన్‌తో పాటు కుటుంబ సభ్యులను కలిసిన అల్లు అర్జున్‌.. మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. సోమవారం నాడు హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ ను అల్లు అర్జున్ కలిశారు.

కారులో బాంబు పెడతాం.. సల్మాన్ ఖాన్‌ను లేపేస్తాం..

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. వాట్సాప్ ద్వారా బాంబ్ బెదిరింపు కాల్ వచ్చింది. కారులో బాంబు పెట్టి పేల్చాస్తామని ఆగంతకుడు బెదిరించాడు. దీనిపై ముంబైలోని వర్లిలోని ట్రాన్స్ పోర్ట్ విభాగానికి మెసేజ్ వచ్చింది. దీంతో వర్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. సల్మాన్ ఖాన్‌కు సెక్యూరిటీని మరింత టైట్ చేశారు అధికారులు. సల్మాన్ ఖాన్‌కు ప్రాణాలకు ఎలాంటి హాని కలగకుండా భద్రతను మరింత కట్టు దిట్టం చేశారు పోలీసులు.

తిరుమలలో కొడుకు కోసం మొక్కు తీర్చుకున్న అన్నా లెజినోవా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య అన్నాలెజినోవా తిరుమల తిరుపతి లో శ్రీవారిదర్శనం చేసుకున్నారు. అంతకు ముందు ఆమె గుండుచేయించుకుని, శ్రీవారికి తలనీలాల మొక్కులు కూడా చెల్లించుకున్నారు. సింగపూర్ లో అగ్నిప్రమాదం నుంచి తన తనయుడు మార్క్ శంకర్ బయటపడటంతో ఆమె తన మొక్కులు చెల్లించుకున్నారు. సాధారణ భక్తుల్లాగానే కళ్యాణకట్టకు వెళ్లి తలనీలాలు సమర్పించుకున్నారు అన్నాలెజినోవా, పవన్ కళ్యాణ్ భార్య వచ్చారని తెలిసి ఆమెను చూడటానికి భక్తులు ఎగబడ్డారు.

హరిహర వీరమల్లు రిలేజ్‌ డేట్‌‎పై క్లారిటీ..

హరి హర వీరమల్లు రిలేజ్‌ డేట్‌ విషయంలో మరోసారి క్లారిటీ ఇచ్చారు మేకర్స్. డబ్బింగ్‌, రీ రికార్డింగ్‌, వీఎఫ్‌ఎక్స్‌ పనులు ఫుల్ స్వింగ్‌లో జరుగుతున్నాయని, ముందు ప్రకటించినట్టుగా మే 9న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని ఎనౌన్స్ చేశారు. పవన్‌ కల్యాణ్ టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న ఈ సినిమాకు జ్యోతికృష్ణ దర్శకుడు.

హనుమాన్ జయంతి స్పెషల్… చిరు విశ్వంభర లో రామ రామ సాంగ్

మెగాస్టార్ చిరంజీవికి, ఆయన కుటుంబ సభ్యులకు హనుమంతుడు అంటే ఎంత భక్తి అనేది ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. తమ కుల దైవంగా భావిస్తారు. హనుమాన్ జయంతి సందర్భంగా చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా ‘విశ్వంభర’ నుంచి‌ ‘రామ రామ’ విడుదల చేశారు.

మీ క్యాలెండర్లను మార్క్ చేసుకోండి, దొంగప్ప పురాణం వచ్చేస్తోంది… కన్నప్ప పై మంచు మనోజ్

మనోజ్ మరోసారి కంప్లయింట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లడంతో రచ్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే మంచు మనోజ్ చేసిన ట్వీట్ చర్చకు దారి తీసింది. “మార్క్ యువర్ క్యాలెండర్స్… ద లెజెండ్ ఆఫ్ దొంగప్ప జూన్ 27న బిగ్ స్క్రీన్‌పైకి రాబోతోంది. ఇంతకీ రిలీజ్ జూలై 17నా ? లేదా జూన్ 27నా? 100 కోట్లకు పైగా బడ్జెట్ (80% విస్మిత్ కమిషన్) మూవీ పీఆర్ ప్లానింగ్ కేక” తన సినిమా ‘భైరవం’కు భయపడి ‘కన్నప్ప’ సినిమాను […]

గుడ్ బ్యాడ్ అగ్లీ హెచ్‌ డీ ప్రింట్‌ లీక్‌, విడుదలైన 8 గంటల్లోనే ఆన్‌లైన్‌లో.. అజిత్‌ ఫైర్

అజిత్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రం తమిళనాడులో గురువారం (ఏప్రిల్‌ 10)న విడుదలైంది. భారీ అంచనాల మధ్య ఈ మూవీ ఆడియెన్స్ ముందుకు వచ్చింది. విడుదలైన 8 గంటల్లోనే హెచ్‌డి క్వాలిటీతో ఇంటర్నెట్‌లో లీక్ కావడం షాక్‌కు గురిచేసింది. దీనిని అడ్డుకోవడానికి నటీనటుల సంఘం, చిత్ర యూనిట్‌ అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి ఫలితం లేదు. తమిళ్ రాకర్స్ మాత్రమే కాకుండా, వాట్సాప్ గ్రూపుల్లో టెలిగ్రామ్ పేజీలో కూడా సినిమాకు సంబంధించిన లింక్ వేగంగా […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON