టాలీవుడ్‌లో విషాదం.. అదుర్స్ మూవీ నటుడు మృతి..
ప్రముఖ విలన్ ముకుల్ దేవ్ అనారోగ్యంతో కన్ను మూశారు. ముకుల్ దేవ్, బాలీవుడ్, పంజాబీ, దక్షిణ భారత సినిమాల్లో నటించి మెప్పించారు. ముకుల్ దేవ్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్నారని, ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో ఐసియూలో చికిత్స పొందుతూ మరణించారని తెలుస్తుంది. తెలుగులో కృష్ణ, ఏక్ విలన్, సిద్ధం, కేడి, అదుర్స్, బెజవాడ, మనీ మనీ మోర్ మనీ, నిప్పు, భాయ్ సినిమాల్లో నటించాడు.

