loader

ఇళయరాజా

భారతదేశపు సంగీత దర్శకుడు, పాటల రచయిత, గాయకుడు. తన 30 సంవత్సరాల వృత్తి జీవితములో వివిధ భాషలలో దాదాపు 5,000 పాటలకు, 1000 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు.

కాలమే బయటపెడుతుంది.. డైరెక్టర్ భార్య సంచలన పోస్ట్.

సమంత డైరెక్టర్ రాజ్ వీడియో వైరల్ కాగానే డైరెక్టర్  భార్య శ్యామలి కూడా ఒ పోస్ట్ పెట్టింది, కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది.. అలాగే కాలమే అన్నింటిని బయటపెడుతుంది.. కర్మ సిద్ధాంతం ఎప్పటికీ ఒక్కటే చెబుతుంది.. ఈ విశ్వం అన్నింటిని నిశితంగా గమనిస్తూ ఉంటుంది చూస్తూ ఉంటుంది. కాలమే అన్ని విషయాలను బయటపెడుతుంది.అనే  కొటేషన్ ని షేర్ చేయడంతో పాటు కర్మ నువ్వు ఏం ఇస్తావో నీకు అదే తిరిగి ఇస్తుంది అనే యాష్ ట్యాగ్ ని […]

25 ఇయర్స్ ఆఫ్ శేఖర్ కమ్ముల

సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినీ ఇండస్ట్రీలో 25 ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో మెగాస్టార్ చిరంజీవిని కలిశారు శేఖర్ కమ్ముల. ఈ సందర్భంగా ‘25 ఇయర్స్ ఆఫ్ శేఖర్ కమ్ముల’ సెలబ్రేటింగ్ ది సోల్ ఆఫ్ స్టొరీ టెల్లింగ్ పోస్టర్ ని మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేసి ఆయన్ని అభినందించారు. శేఖర్ కమ్ముల సోషల్‌మీడియా వేదికగా పోస్ట్ చేశారు. టీనేజీలో ఒక్కసారి చిరంజీవిని దగ్గరగా చూశాను. ఈయనతో సినిమా తీయాలి అనే […]

నేడే మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే

72వ మిస్ వరల్డ్ పోటీలు చివరి దశకు వచ్చేశాయి. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల్లో ఇవాళ గ్రాండ్ ఫినాలే జరగనుంది. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా ప్రారంభం కానున్న గ్రాండ్ ఫినాలే ప్రత్యక్ష ప్రసారం కానుంది. మొత్తం 108 మంది పాల్గొన్న ఈ పోటీలకు సంబంధించి ఇవాళ జరగనున్న గ్రాండ్ ఫినాలే బరిలో 16 మంది నిలిచారు. అందం-ఐక్యత లక్ష్యంగా జరుగుతున్న పోటీల తుది వేడుకలు

గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్‌‌లో బాలయ్యకు పురస్కారం

నందమూరి బాలకృష్ణ అకౌంట్‌లో ఈ సంవత్సరం మరో అరుదైన పురస్కారం చేరింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మ భూషణ్ పురస్కారాన్ని అందుకున్న నందమూరి బాలకృష్ణ.. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ‘ఎన్టీఆర్ నేషనల్ అవార్డు’కు ఎంపికయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఫస్ట్ టైమ్ ఇస్తున్న గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఎన్టీఆర్ జాతీయ అవార్డ్‌ను అందుకున్న మొదటి వ్యక్తిగానూ బాలయ్య చరిత్ర సృష్టించబోతున్నారు.

సూపర్ స్టార్ కృష్ణ జయంతి

ఘట్టమనేని కృష్ణ తెలుగు సినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత. కృష్ణ 1970లు, 80ల్లో తెలుగు సినిమా హీరోగా ప్రజాదరణ సాధించి, సూపర్ స్టార్‌గా ప్రఖ్యాతి పొందాడు. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్‌లో 340 పైచిలుకు సినిమాల్లో ప్రధాన పాత్రలో నటించాడు. 1970లో నిర్మాణ సంస్థను ప్రారంభించి పద్మాలయా సంస్థ ద్వారా పలు విజయవంతమైన చలన చిత్రాలు తీశాడు. 1983లో ప్రభుత్వ సహకారంతో స్వంత స్టూడియో పద్మాలయా స్టూడియోను హైదరాబాద్‌లో నెలకొల్పాడు. దర్శకుడిగానూ 16 సినిమాలు తీశాడు.

తప్పు చేస్తేనే సారీ చెబుతా..కమల్

కమల్ హాసన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దక్షిణ భారత సినీ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాజా వివాదంపై స్పందించిన కమల్ హాసన్.. “నేను తప్పు చేస్తేనే క్షమాపణలు చెబుతాను. మన దేశం ప్రజాస్వామ్య దేశం. నేను చట్టాన్ని, న్యాయాన్ని గౌరవిస్తాను. కర్ణాటకపై నాకున్న ప్రేమ నిజమైనదే. ఇదే విధంగా ఆంధ్రా, కేరళ పట్ల కూడా. నా జీవన శైలి ఇది. దయచేసి దానిని లాగకండి” అని అన్నారు.

సీఎంని కలిసిన హరి హర వీరమల్లుకు నిర్మాత ఏఎం రత్నం

తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి అయితే ఈ టికెట్ రేట్ల పెంపు విషయంలో అంత సుముఖంగా లేరన్న సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్ ఘటన తరువాత పరిణామాలన్నీ మారాయి. అదనపు షోలు, ఫ్యాన్స్ షోలు, బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు అనే మాట కూడా ఎత్తడం లేదన్న సంగతి తెలిసిందే. మరి ఇలాంటి టైంలో హరి హర వీరమల్లు నిర్మాత ఏఎం రత్నం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.

కమల్ కామెంట్స్‌పై స్పందించిన కన్నడ నటి రమ్య..

‘కన్నడ తమిళం నుంచి పుట్టింది’ అన్న కమల్ వ్యాఖ్యలపై కర్ణాటకలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కమల్ హాసన్ కామెంట్స్ పై కన్నడ నటి, మాజీ ఎంపీ రమ్య స్పందించింది. సోషల్ మీడియాలో నటి రమ్య, ద్రావిడ భాషల మూలం చార్ట్‌ను షేర్ చేశారు. రమ్య పంచుకున్న పట్టిక ప్రకారం, తమిళం, కన్నడ, తెలుగు, మలయాళం తదితర భాషలు ద్రావిడ భాష కిందకు వస్తాయని పేర్కొంటూ రమ్య ఒక సందేశాన్ని కూడా షేర్ చేసింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON