loader

నటుడు ఆర్యకు షాక్ ఇచ్చిన ఐటి అధికారులు

ప్రముఖ తమిళ నటుడు ఆర్యకు ఐటి శాఖ అధికారులు షాక్ ఇచ్చారు. ఆయన నివాసంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు నిర్వహించినట్లు సమాచారం చెన్నైలోని అన్నానగర్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న ‘‘సీ షెల్’’ రెస్టారెంట్లపై సోదాలు చేపట్టారు. గతంలో ఈ రెస్టారెంట్ చైన్‌తో సంబంధం ఉండటంతో ఆర్య నివాసంలోనూ తనిఖీలు జరిపారు.

యూట్యూబ్‌కే హార్రర్ పుట్టించిన ప్రభాస్..

ప్రభాస్ ‘ది రాజా సాబ్’ టీజర్ సోమవారం విడుదలైంది. గత కొన్నేళ్లుగా అప్డేట్స్ లేక ఆశాభంగానికి గురైన అభిమానులకు టీజర్ కిక్కిస్తోంది. వింటేజ్ లుక్‌లో ప్రభాస్ ఎంట్రీ, చిలిపితనంతో ఆకట్టుకున్నాడు. టీజర్ అలా వచ్చిందో లేదో యూట్యూబ్ షేక్ అయిపోయింది. 24 గంటల్లోనే ఏకంగా 59 మిలియన్ వ్యూస్‌తో రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటికీ యూట్యూబ్‌ ట్రెండింగ్‌ అవుతూ నంబర్ వన్‌ ప్లేస్‌లో కొనసాగుతోంది.

కన్నప్ప మూవీ చూసి రజినీకాంత్..!

కన్నప్ప ఫైనల్ కాపీ చూసిన సీనియర్ హీరో, సూపర్ స్టార్ రజినీకాంత్.. మంచు విష్ణు టీం మొత్తాన్ని అభినందించారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు విష్ణు. రజనీకాంత్‌ అంకుల్‌ కన్నప్ప మూవీ చూశాక నన్ను ప్రేమగా ఆలింగనం చేసుకున్నారు. తనకు ఈ సినిమా ఎంతగానో నచ్చిందని చెప్పారు. చాలా చాలా సంతోషంగా అనిపించింది. నటుడిగా ఈ క్షణం కోసం నేను 22 ఏళ్లుగా ఎదురుచూస్తున్నా అని మంచు విష్ణు […]

రెబల్ వైబ్ స్టార్ట్.. ‘రాజాసాబ్’ టీజర్ వచ్చేసింది

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రొమాంటిక్ హర్రర్ కామెడీ సినిమా ‘రాజాసాబ్‘. డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. కొద్దిసేపటిక్రితమే ఈ మూవీ టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మారుతి తోపాటు మేకర్స్ ప్రసాద్ ఐమాక్స్ వద్ద సందడి చేశారు. థియేటర్ వద్ద ప్రభాస్ భారీ కటౌట్ ఏర్పాటు చేశారు.

కావ్యా మారన్‌తో పెళ్లి అంటూ ప్రచారం- అనిరుధ్ రవిచందర్ రియాక్షన్

మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఐపీఎల్‌లో సన్ రైజర్స్ సీఈవోగా వ్యవహరిస్తోన్న కావ్యా మారన్‌తో పెళ్లి అంటూ ప్రచారం సాగుతోంది. అనిరుధ్, కావ్యా మారన్ రిలేషన్ షిప్‌లో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని కోలీవుడ్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. వీటిపై తాజాగా అనిరుధ్ స్పందిస్తూ కావ్యతో పెళ్లి వార్తలను ఖండించారు. ‘పెళ్లా?.. రూమర్స్ ప్రచారం ఆపండి’ అంటూ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు.

ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు అందుకున్న బాలకృష్ణ

గద్దర్ ఫిల్మ్ అవార్డుల్లో భాగంగా ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ స్పెషల్ జ్యూరీ అవార్డును బాలకృష్ణ అందుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ‘ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు’ అందుకున్నారు బాలకృష్ణ. మెమొంటోతో పాటు రూ.10 లక్షల ప్రైజ్ మనీ, ప్రత్యేక ప్రశంసా పత్రం బాలయ్యకు అందజేశారు. ఈ ప్రైజ్ మనీ బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి రీసెర్చ్ సెంటర్‌కు అందిస్తామని బాలకృష్ణ తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా అవార్డ్ అందుకున్న అల్లు అర్జున్..

పుష్ప 2 సినిమాలో నటనకుగానూ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ కు గద్దర్ అవార్డ్ ప్రకటించింది తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అల్లు అర్జున్ గద్దర్ అవార్డ్ అందుకున్నారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ..“ఈ అవార్డ్ నాకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే పుష్ప 2 సినిమాకు నేను గెలిచిన మొదటి అవార్డ్ అది. ఈ అవార్డును నేను నా అభిమానులకు అంకితం చేస్తున్నాను. మీ ప్రేమ, సపోర్ట్ కు ధన్యవాదాలు.

ఘనంగా గద్దర్ ఫిల్మ్ అవార్డుల వేడుక

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక ఘనంగా ప్రారంభమైంది. హైదరాబాద్ హైటెక్స్‌ వేదికగా జరుగుతున్న ఈవెంట్‌కు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి, ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు సహా ఇతర రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దిల్ రాజు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

పవన్ దెబ్బకు దిగి వచ్చిన టాలీవుడ్ పెద్దలు..

టాలీవుడ్ సినీ పెద్దలు మెడలు వంచడంలో పవన్ కళ్యాణ్ సఫలీకృతులయ్యారా అంటే ఔననే సమాధానం వస్తోంది. సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యేందుకు సిద్దమయ్యారు. ఈనెల 15వ సినీ ఇండస్ట్రీ పెద్దలంతా అమరావతికి వెళుతున్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ఏపీ సీఎం చంద్రబాబు తో సమావేశం కానున్నారు. టాలీవుడ్ బృందానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నాయకత్వం వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఏపీ సీఎం చంద్రబాబు దగ్గరకు టాలీవుడ్ పెద్దలు… పవన్ ఎఫెక్ట్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబుతో ఆదివారం సాయంత్రం టాలీవుడ్ పెద్దల సమావేశం ఖరారు అయింది. ఫిల్మ్ ఇండస్ట్రీ సమస్యల గురించి చర్చించేందుకు ప్రభుత్వ అధికారులు లేదా ముఖ్యమంత్రుల కలిసే సమయంలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి లిస్టు ఎంపిక చేయడం ఆనవాయితీ. కానీ ఈసారి మాత్రం ఛాంబర్ ఎంపిక చేసిన లిస్ట్ కాకుండా, నందమూరి బాలకృష్ణను, పవన్ కళ్యాణ్‌ను సంప్రదించి లిస్ట్ ఎంపిక చేసినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఇన్‌సైడ్ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON