loader

ఇంకోసారి అలా మాట్లాడావో ఖబడ్డార్… శిరీష్‌కి మెగా ఫ్యాన్స్ వార్నింగ్

ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ ‘గేమ్ ఛేంజర్’పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. “ప్లాప్ అయ్యాక రామ్ చరణ్ ఫోన్ అయినా చేశారా?” అన్న అతని వ్యాఖ్యలపై మెగా అభిమానులు తీవ్రంగా స్పందించారు. శిరీష్‌కి వార్నింగ్ ఇచ్చే లేఖ విడుదల చేశారు. “మీరు ప్రతిసారీ హీరోపై, సినిమాపై విషం చిమ్మడం మాకు మానసికంగా బాధ కలిగిస్తోంది. ఇక ఒక్కసారి గానీ తప్పుగా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయి” అంటూ హెచ్చరించారు.

పవన్ కల్యాణ్ సెట్స్ కు చిరు…

‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో హీరో పవన్ కల్యాణ్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుండగా మెగస్టార్ చిరంజీవి ప్రత్యక్షకావడంతో సినిమా యూనిట్ ఆశ్చర్యపోయింది. పవన్‌తో చిరంజీవి దిగిన ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఒక సినిమా తీయాలని మెగా అభిమానులు కోరుతున్నారు.

‘జానకి’ పేరుపై రచ్చ.. సెన్సార్ బోర్డు కార్యాలయం వద్ద నిరసన

మలయాళ చిత్రం ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ సెన్సార్ బోర్డుతో వివాదంలో చిక్కుకుంది. బాధిత మహిళ పాత్రకు ‘జానకి’ అనే పేరుపెట్టడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసిన సెన్సార్ బోర్డు, సినిమా సర్టిఫికేట్ జారీకి నిరాకరించింది. జానకి అంటే సీతాదేవి అనే అభిప్రాయం నేపథ్యంలో ఈ అభ్యంతరం వచ్చిందని సమాచారం. ఈ వ్యవహారం న్యాయస్థానంలో నడుస్తుండగానే సెన్సార్ బోర్డు  ఎదుట అమ్మ, ఫిల్మ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ కేరళ ఆధ్వర్యంలో మలయాళ సినీ, సీరియల్‌ ఆర్టిస్టుల […]

ఆస్కార్ అకాడమీలో కమల్- పవన్ కల్యాణ్ ప్రశంసలు

ప్రతిష్టాత్మక ఆస్కార్ అకాడమీలో మెంబర్‌గా కమల్ ఎంపిక కావడంపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు. ఇది భారతీయ చిత్ర పరిశ్రమకు ఎంతో గర్వకారణమని అన్నారు. కమల్‌కు ఆస్కార్ అకాడమీలో చోటు దక్కడం భారతీయ చిత్ర పరిశ్రమకు ఎంతో గర్వకారణమని అన్నారు. 6 దశాబ్దాల పాటు అద్భుతమైన నటనతో అందరినీ అలరించారు. కమల్ గారు ఓ నటుడి కంటే ఎక్కువ అన్నారు

బిగ్‏బాస్ సీజన్ 9 ప్రోమో.. మరింత కిక్కిచ్చేలా

బుల్లితెరపై మోస్ట్ అవైటెడ్ రియాల్టీ షో బిగ్‏బాస్. ఇప్పటికే తెలుగులో 8 సీజన్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. త్వరలోనే ఈ షో 9 సీజన్ స్టార్ట్ కాబోతుంది. తాజాగా ఈ షో ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. ఎప్పటిలాగే ఈసారి సైతం నాగార్జున హోస్టింగ్ చేయనున్నారు. అలాగే ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్స్ గురించి సోషల్ మీడియాలో రోజుకో న్యూస్ వైరలవుతుంది.

ఎయిర్‏పోర్టులో గాయపడ్డ సింగర్ చిత్ర..

తనకు చెన్నై విమానాశ్రయంలో ప్రమాదం జరిగినట్లు తెలిపింది. చెన్నై విమానాశ్రయంలో నిలబడి ఉన్నాను. బ్యాలెన్స్ తప్పి పడిపోయాను. దీంతో నా భుజం దగ్గరి ఎముక పక్కకు జరిగింది. దాదాపు అంగుళంన్నర కిందకు ఎముక జరిగింది. వెంటనే నన్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. డాక్టర్స్ ఎముకను సరిచేశారు. కానీ మూడు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. అలాగే మరో మూడు నెలలు నేను జాగ్రత్తగా ఉండాలని చెప్పారు” అంటూ చిత్ర చెప్పుకొచ్చారు.

కన్నప్ప టికెట్ల రేట్ల పెంపుకు అనుమతి

భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన అలనాటి భక్తిరస చిత్రం ‘భక్త కన్నప్ప’ సినిమాకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా సినిమా టికెట్ల ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఏపీలో సింగిల్‌ స్క్రీన్స్‌, మల్టీప్లెక్స్‌ల్లో రూ.50 (జీఎస్టీ అదనం) వరకు పెంచుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కల్పించింది. సినిమా విడుదలైన తేదీ నుంచి 10 రోజుల పాటు ఈ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.

మంచు విష్ణు కార్యాలయంలో జిఎస్టి అధికారుల సోదాలు

మంచు విష్ణు ప్రస్తుతం ‘కన్నప్ప’ సినిమా విడుదల పనుల్లో బిజీగా ఉన్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా జూన్ 27వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన కార్యాలయంలో జిఎస్టి అధికారులు సోదాలు నిర్వహించినట్లు సమాచారం. లెక్క ప్రకారం జిఎస్టి కట్టారా? లేదా? అనే విషయంపై అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది.

వీడియో గేమ్‌లో రాజమౌళి..

రాజమౌళి ఓ వీడియో గేమ్‌లో ప్రత్యక్షమయ్యారు. వీడియో గేమ్‌లు ఇష్టపడే అందరికీ హిడియో కోజిమా సుపరిచితమే. ఆయన రూపొందించిన సూపర్‌ సక్సెస్‌ గేమ్‌ డెత్‌ స్ట్రాండింగ్‌ సెకండ్ వెర్షన్‌లో రాజమౌళి, కార్తికేయ కనిపించనున్నారు. ఇందుకు సంబంధించి వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. డెత్‌ స్ట్రాండింగ్‌ 2లో హాలీవుడ్‌ నటులు నార్మన్‌ రీడస్‌, ఎల్లీ ఫానింగ్‌లు భాగం కాగా.. వారితో పాటు రాజమౌళి, కార్తికేయ కూడా కనిపించనున్నారు. ఈ గేమ్ జూన్ 26 నుంచి పూర్తిగా అందుబాటులోకి […]

రామోజీ ఫిలిం సిటీ ప్రపంచంలోనే అత్యంత భ‌యాన‌క ప్ర‌దేశం.. కాజోల్ షాకింగ్ కామెంట్స్

నేను షూటింగ్ చేసిన ప్రదేశాల్లో చాలా భయానక ప్రదేశాలు ఉన్నాయి. భయంతో రాత్రుల్లో నిద్ర పట్టేది కాదు.  తిరిగి ఎప్పుడూ అక్కడికి రాకూడదని అనుకునేదాన్ని. హైదరాబాద్ లోని రామోజీరావు స్టూడియోని ప్రధాన ఉదాహరణగా చెప్పొచ్చు. ఇది వరల్డ్ లోనే అత్యంత భయంకరమైన ప్రదేశమని బాలీవుడ్ నటి కాజోల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. పాన్ ఇండియా సినిమాల షూటింగ్ జరిగే చోటును ఆమె అలా ఎలా అంటారని ప్రశ్నిస్తున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON