తనకు చెన్నై విమానాశ్రయంలో ప్రమాదం జరిగినట్లు తెలిపింది. చెన్నై విమానాశ్రయంలో నిలబడి ఉన్నాను. బ్యాలెన్స్ తప్పి పడిపోయాను. దీంతో నా భుజం దగ్గరి ఎముక పక్కకు జరిగింది. దాదాపు అంగుళంన్నర కిందకు ఎముక జరిగింది.
వెంటనే నన్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. డాక్టర్స్ ఎముకను సరిచేశారు. కానీ మూడు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. అలాగే మరో మూడు నెలలు నేను జాగ్రత్తగా ఉండాలని చెప్పారు” అంటూ చిత్ర చెప్పుకొచ్చారు.

