loader

ఇలాంటి మహానటుడు మళ్లీ దొరకరు… ‘కోట’కి మెగా బ్రదర్స్ నివాళి

కోట శ్రీనివాసరావు భౌతిక కాయానికి మెగా స్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. కోట నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు మెగా బ్రదర్స్ చిరంజీవి , పవన్ కళ్యాణ్ కూడా ఆయనతో నటించిన సినిమాల గురించి, అనుబంధం గురించి గుర్తుచేసుకుంటూ సంతాపం ప్రకటించారు.

కోట శ్రీనివాసరావు పార్థివదేహాన్ని చూసి బ్రహ్మానందం ఎమోషనల్

కోట భౌతికకాయానికి నివాళులర్పించారు నటుడు బ్రహ్మానందం. కోట భౌతికకాయాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. కోట శ్రీనివాసరావు మహానటుడని చెప్పారు. రోజుకు 18 గంటలు పనిచేసేవారని గుర్తుచేసుకున్నారు. కోట లేరంటే నమ్మలేకపోతున్నానని చెప్పారు బ్రహ్మానందం. ఆయన భౌతికకాయానికి నటులు బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్‌ నివాళులు అర్పించారు

కోట మరణం కలచివేసింది, టాలీవుడ్ ప్రముఖుల సంతాపం

నటుడు కోటా శ్రీనివాసరావు మరణంతో టాలీవుడ్ లో విషాదం అలముకుంది. ఆయన మరణవార్త విని ప్రముఖ తారలు కోటాతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సంతాపం ప్రకటించారు. చిరంజీవి, పవన్, జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ, రవితేజ, మంచు హీరోలతో పాటు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. కోటా శ్రీనివాసరావు మరణం తనను ఎంతో కలచివేసిందన్నారు మెగాస్టార్ చిరంజీవి, తాము ఇద్దరు ఒకేసారి ప్రాణం ఖరీదు సినిమాతో కెరీర్ ను స్టర్ట్ చేశామంటూ గతాన్ని […]

సినీ ఇండస్ట్రీలో విషాదం.. కోటా శ్రీనివాసరావు మృతి

తెలుగు సినీ పరిశ్రమలో నటుడుగా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న కోటా శ్రీనివాసరావు ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో విలన్ గా కమెడియన్ గా తండ్రిగా ఎన్నో పాత్రలో నటించి మంచి పేరు సంపాదించారు. తాజాగా కోట శ్రీనివాసరావు అస్వస్థకు గురయ్యి ఈరోజు తెల్లవారుజామున మరణించారు. గడిచిన కొద్దిరోజులుగా తీవ్ర అస్వస్థత ఇబ్బంది పడుతూ ఉన్న కోట శ్రీనివాసరావు తన స్వగృహంలోనే మరణించారు.

అమెరికా వీధుల్లో రాజ్‌-సమంత.. ఫొటోలు వైరల్

హీరోయిన్ సమంత-డైరెక్టర్ రాజ్ నిడిమోరు మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఎంజాయ్ చేస్తున్న సమంత.. అక్కడ దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. అయితే, రాజ్ నిడిమోరు, సామ్ భుజంపై చేయి వేసుకుని అమెరికా వీధుల్లో నడుస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజ్‌-సామ్ ఫొటోలు వైరల్ అవుతున్న నేపథ్యంలో ఆయన భార్య శ్యామాలి చేసిన పోస్ట్‌ కూడా వైరల్‌ అవుతోంది. మన చర్యలతో ఇతరులను బాధించవద్దు అనే అర్థం వచ్చేలా శ్యామాలి […]

బ్యాంక్ స్కామ్‌లో బడా నిర్మాత అల్లు అరవింద్.. రంగంలోకి ED, నోటీసులు

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఊహించని షాకిచ్చారు. రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ బ్యాంక్ స్కామ్‌ కేసులో భాగంగా ఈడీ అధికారులు ఆయనను విచారించారు. హైదరాబాద్‌లో మూడు గంటల పాటు విచారణ జరిగింది. దీంతో ఈ ఇష్యూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. 2018-19లో రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ బ్యాంక్ స్కామ్‌లో పలువురు ప్రముఖుల పేర్లు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. అల్లు అరవింద్ పేరు కూడా ఇందులో ఉంది.

హీరోయిన్ల కోసం ఫేక్ కాస్టింగ్ కాల్స్‌.. విశ్వంభర నిర్మాతల కీలక ప్రకటన

UV క్రియేషన్స్‌ పేరుతో గుర్తు తెలియని వ్యక్తి ఒకరు మోసపూరిత ఆఫర్‌లతో నటీమణులను, వారి ప్రతినిధులను సంప్రదిస్తున్నాడని మా దృష్టికి వచ్చింది. యూవీ క్రియేషన్స్‌కు ఆ వ్యక్తితో లేదా వారి కార్యకలాపాలతో ఎటువంటి సంబంధం లేదని మేము స్పష్టం చేయాలనుకుంటున్నాము. మా నుండి ఏదైనా అఫిషియల్ కమ్యూనికేషన్ లేదా కాస్టింగ్ అధికారిక ఛానెల్‌ల ద్వారా మాత్రమే జరుగుతాయి ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, అటువంటి ఆఫర్స్ గురించి నిజా నిజాలు తెలుసుకొని ముందుకు వెళ్ళాలని ఓ […]

కాలేజీ బుక్‌లో మలయాళ స్టార్ మమ్ముట్టి స్టోరీ

మమ్ముట్టి సేవలను గౌరవిస్తూ కేరళలోని మహారాజ్ కాలేజీ బీఏ హిస్టరీలోని ఆయన కెరీర్‌పై పాఠ్యాంశాన్ని అందించాలని నిర్ణయం తీసుకుంది. ‘సెన్సింగ్ సెల్యులాయిడ్: హిస్టరీ ఆఫ్ మలయాళం సినిమా’ పేరుతో ఓ చాప్టర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మమ్ముట్టి జీవితం, సినీ కెరీర్, సినిమాపై అతని ప్రభావం గురించి బీఏ హిస్టరీ విద్యార్థులు తెలుసుకుంటారు. ఇక్కడ బిగ్ ట్విస్ట్ ఏంటంటే… మమ్ముట్టి కూడా ఈ కాలేజీ విద్యార్థే.

మంచి మనసు చాటుకున్న లారెన్స్..

ముగ్గురు చిన్నారులు తమ తల్లికి ఆరోగ్యం బాలేదని దయచేసి ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వారి వీడియో చూసి చలించిపోయాడు లారెన్స్.  వీడియో నా వరకు షేర్ చేసిన వారి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు ప్రభుత్వాన్ని సాయం కోరినందుకు వాళ్ళు మిమ్మల్ని ఖచ్చితంగా ఆదుకుంటారు. మీకు సహాయం చేయడానికి నేను నా వంతు కృషి చేస్తాను.. నా బృందం ఈరోజే మిమ్మల్ని కలుసుకుంటుంది అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు లారెన్స్.. ఈ పోస్ట్ పై […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON