loader

ఆ ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నంతకాలం నన్ను ఎవరూ ఆపలేరు.. ఎన్టీఆర్

బాద్షా ఈవెంట్ తొక్కిసలాటలో ఓ అభిమాని చనిపోవడం నన్ను ఎంతో బాధపెట్టింది. అందుకే నేను పబ్లిక్ ఈవెంట్స్ అంటే భయపడతాను. 25 ఏళ్ల క్రితం సినిమా ఓపెనింగ్ కోసం వెళ్లినప్పుడు మా నాన్న, మా అమ్మ మాత్రమే ఉంది. కానీ మొట్ట మొదటి సారి మూజీబ్ అనే అభిమాని.. ఇప్పటికీ నాతోనే ఉన్నాడు. ఇంతమంది నా అభిమానులు కావడం నా అదృష్టం.దయచేసి ఈ సినిమాను ఎంజాయ్ చేయండి. డబుల్ కాలర్ ఎత్తాను.. కుమ్మేద్దాం. మళ్లీ సక్సెస్ మీట్ […]

ఎయిర్‌పోర్టులో అల్లు అర్జున్‌కు ఎదురైన చేదు అనుభవం

చాలామంది స్టార్స్ విమాన ప్రయాణాల సమయంలో గుర్తుపట్టకుండా మాస్కులు, క్యాప్‌లు వేసుకుని ముఖం కవర్ చేసుకుంటారు. అదే విధంగా, అల్లు అర్జున్ కూడా ముంబయి ఎయిర్‌పోర్టుకి వెళ్లినప్పుడు మాస్క్ ధరించి ప్రయాణించాడు. అయితే, చెకింగ్ దగ్గర సెక్యూరిటీ సిబ్బంది ఆయన్ని వెంటనే గుర్తించలేకపోయారు. రూల్స్ ప్రకారం మాస్క్ తీయాలని ఆదేశించారు. దీంతో బన్నీ తన కూలింగ్ గ్లాస్ తీయగా కూడా ఆయనను గుర్తించలేదు. చివరికి మాస్క్ పూర్తిగా తీయగానే మాత్రమే అల్లు అర్జున్ అని గుర్తించి లోనికి […]

ఉద్యోగులకు ఫ్రీ టిక్కెట్లు, సెలవు… తమిళనాడులో ‘కూలీ’ ఫీవర్

సూపర్‌స్టార్ రజనీకాంత్ 50 ఏళ్ల సినీ ప్రస్థానం, ‘కూలీ’ మూవీ విడుదల సందర్భంగా అభిమానులు ఉత్సాహంగా వేడుకలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో యుఎన్ఓ ఆక్వా సంస్థ ఆగస్ట్ 14న ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. అంతేకాదు ప్రతి ఉద్యోగికి ఉచిత సినిమా టికెట్లు అందజేయడంతో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా స్వీట్స్ పంచనుంది. ఓల్డేజ్ హోమ్స్, అనాథాశ్రమాల్లోనూ స్వీట్స్ పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. రజనీకాంత్ 50వ సిల్వర్ జూబ్లీ వేడుకలను గుర్తిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది.

ఫలించని చర్చలు.. పర్సంటేజ్ విధానానికి ఒప్పుకోని ఫెడరేషన్

సినీ కార్మికుల వేతనాలపై నిర్మాతల కీలక ప్రతిపాదనలు జరిగాయి. రోజు వేతనం 2 వేల లోపు ఉన్నవారికి పెంచాలని నిర్ణయం తీసుకున్నారు నిర్మాతలు. 3 విడతల్లో వేతనాల పెంపునకు నిర్మాతల అంగీకారం తెలిపారు. కాగా ఈ చర్చలు విఫలం అయ్యాయి. నిర్మాతల ప్రతిపాదనలను అంగీకరించలేదు కార్మిక ఫెడరేషన్. పర్సంటేజ్ విధానాన్ని ఫెడరేషన్ ఒప్పుకోలేదు. 30శాతం వేతనాలు పెంచితేనే షూటింగ్స్‌కు వెళ్తాం, నిర్మాతల షరతులను అంగీకరిస్తాం కానీ.. అన్ని యూనియన్ల కార్మికులకు సమానంగా వేతనం పెంచాలి. యూనియన్లను విడగొట్టేలా […]

నేను ఎవరికీ హామీ ఇవ్వలేదు, ఫేక్ న్యూస్ పై మెగాస్టార్ చిరంజీవి క్లారిటీ

చిరంజీవి ప్రకటనలో ఈ విధంగా అన్నారు. “నా దృష్టికి వచ్చిన విషయం ఏమిటంటే — ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులమని చెప్పుకుంటున్న కొంతమంది వ్యక్తులు మీడియాలోకి వెళ్లి, నేను వారిని కలసి, 30% వేతన పెంపు వంటి వారి డిమాండ్లను అంగీకరించానని తప్పుడు ప్రకటనలు చేశారు. నేను ఫెడరేషన్‌కి చెందిన ఎవరినీ కలవలేదు.” ఇది పరిశ్రమ మొత్తానికి సంబంధించిన సమస్య అని, వ్యక్తిగతంగా ఏ ఒక్కరు అయినా ఈ విషయంపై ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదని చిరంజీవి […]

మహేశ్ బాబు బర్త్‌డే..SSMB29 నుండి బిగ్ అప్‌డేట్

మహేష్ ఫ్యాన్స్ కోసం రాజమౌళి ఓ పోస్ట్ పెట్టారు. మహేశ్ ప్రీలుక్‌ ఫొటోలా ఇది ఉంది. రాజమౌళి పెట్టిన లుక్‌లో హీరో మెడలో మూడు నామాలు, త్రిశూలం, ఢమరుకం, నంది బొమ్మలు ఉన్న మాల ఉంది. ఈ సినిమా సారాంశాన్ని, లోతును, మేం సృష్టిస్తున్న ప్రపంచాన్ని మీకు చూపించేందుకు ప్రత్యేకంగా ఒక ప్రదర్శనను సిద్ధం చేస్తున్నాం. ఇది ముందెన్నడూ చూడని విధంగా ఉంటుంది. మీ ఓపికకు ధన్యవాదాలు” అని జ‌క్క‌న్న రాసుకొచ్చారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్….రీపోస్టింగ్ బటన్

ప్రముఖ సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్ కొత్తగా ఒక ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. రీపోస్ట్ అనే ఫీచర్ సహాయంతో యూజర్స్ వారికి నచ్చిన పోస్ట్ , రీల్‌ను రీపోస్ట్ చేయవచ్చు. ఇది వారి ఫాలోవ్స్ ఫీడ్‌లో కనిపిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో యూజర్ ఇంటరాక్షన్ పెంచేందుకు, ఫ్రెండ్స్‌ ఫీడ్‌లో కంటెంట్ డిస్కవరీ ఫీచర్‌ను మెరగుపర్చేందకు ఈ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీనితో పాటు మరో 2 ఫీచర్లను ఇన్‌స్టాగ్రామ్ ప్రవేశపెట్టింది. ఇన్‌స్టాగ్రామ్ మ్యాప్(Instagram Map), రీల్స్‌లో ఫ్రెండ్స్ ట్యాబ్‌ను అందుబాటులోకి తెచ్చింది.

మా అధ్యక్షుడు మంచు విష్ణు సంచలన నిర్ణయం

‘మా’ అనుమతి లేకుండా ప్రదర్శనలు ఇచ్చే నటీనటులకు పారితోషికం లభించకపోతే, ఆ బాధ్యత ‘మా’ వహించదని మంచు విష్ణు స్పష్టం చేశారు. ఈ చర్య ద్వారా నటీనటుల హక్కులను కాపాడాలని, మధ్యవర్తుల ద్వారా జరిగే మోసాలను అరికట్టాలని ‘మా’ భావిస్తోంది. ఈ నిర్ణయం వల్ల ఆర్టిస్టుల పారితోషికాలు సకాలంలో అందే అవకాశం ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. సైమా అవార్డు ఫంక్షన్‌లో స్టార్ హీరోయిన్ కు పారితోషికం ఇవ్వకుండా ఎగ్గొట్టారని, ఇలాంటి సంఘటనలు జరగకుండా కొత్త రూల్‌ను తీసుకొచ్చారు.

రక్తదానం చేస్తున్న అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.. మెగాస్టార్ చిరంజీవి

79వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని ఫీనిక్స్ ఫౌండేషన్, చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా మెగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు రక్తదానం చేస్తున్న దాతలు అందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. రక్తదానం చేయడం అనేది ఎనలేని సంతృప్తిని ఇస్తుంది. దాని వలన ఒక ప్రాణం నిలబడుతుంది. నేను ఇది ఎన్నో ఏళ్లుగా అనుభవిస్తున్న గొప్ప ఫీలింగ్.

నేను చేసింది ఇల్లీగల్‌ బెట్టింగ్‌ యాప్‌ కాదు, గేమింగ్‌ యాప్‌

విచారణ అనంతరం బయటకు వచ్చిన విజయ్‌ దేవరకొండ దీనిపై వివరణ ఇచ్చారు. అదే సమయంలో క్లారిటీ కూడా ఇచ్చారు. తాను చేసింది ఇల్లీగల్‌ బెట్టింగ్‌ యాప్‌ ప్రమోషన్‌ కాదు అని, గేమింగ్‌ యాప్‌లను ప్రమోట్‌ చేసినట్టు తెలిపారు. ఈ విషయాన్ని మీడియా గమనించాలని చెప్పింది. బెట్టింగ్‌ యాప్‌లు అక్రమమే కానీ, తాను చేసిన గేమింగ్‌ యాప్‌లు అని, అవి అధికారికంగా ప్రభుత్వం(చట్టబద్దంగా) చేత రిజిస్టర్‌ అయినవే అని అందులో ఇల్లీగల్‌ ఏం లేదని స్పష్టం చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON