loader

పవన్ కళ్యాణ్ ఓజీకి ఎదురుదెబ్బ.. హైకోర్టు ఇలా ట్విస్ట్

ఓజీ రిలీజ్ కి అంతా రెడీ అయింది. తెలంగాణలో టికెట్ ధరల పెంపు తో పాటు ప్రీమియర్ షోలు ప్రదర్శించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులని హైకోర్టు తాజాగా సస్పెండ్ చేసింది. ఈ మేరకు జస్టిస్ శ్రవణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇది ఓజీ చిత్రానికి ఏమాత్రం ఊహించని ఎదురుదెబ్బ అనే చెప్పాలి. ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో చాలా మంది ప్రీమియర్ షోల టికెట్స్ బుక్ చేసుకున్నారు. […]

యేసుదాస్‌‌కు ప్రతిష్టాత్మక ఎంఎస్ సుబ్బులక్ష్మి అవార్డు -సాయిపల్లవి, అనిరుథ్ల కు కలైమామణి

యేసుదాస్‌‌కు ప్రతిష్టాత్మక ఎంఎస్ సుబ్బులక్ష్మి అవార్డు – సాయిపల్లవి, అనిరుథ్ రవిచందర్‌లకు కలైమామణి పురస్కారాలు తమిళనాడు ప్రభుత్వం సినీ రంగంలో ప్రతిష్టాత్మక అవార్డులను ప్రకటించింది. కళ, సంస్కృతికి కృషి చేసిన కళాకారులకు ఎంఎస్ సుబ్బులక్ష్మి, భారతీయార్, కలైమామణి అవార్డులను ప్రకటించింది. 2021, 2022, 2023 సంవత్సరాలకు ఫేమస్ సింగర్ కేజే యేసుదాస్, హీరోయిన్ సాయి పల్లవి, ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ అవార్డులు అందుకున్నారు.

తెలుగు సినిమాకి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు

71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినీ ప్రముఖులు తమ చిత్రాలతో సత్తా చాటి నేడు రాష్ట్ర చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. భగవంత్ కేసరి చిత్రం టాలీవుడ్ నుంచి ఉత్తమ చిత్రం గా ఎంపికైంది. ఈ అవార్డుని డైరెక్టర్ అనిల్ రావిపూడి రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. దర్శకుడు సాయి రాజేశ్ “బేబీ” సినిమాకు ఉత్తమ కథా రచయిత విభాగంలో గాయకుడు పీవీఎన్‌ఎస్ రోహిత్ ఉత్తమ నేపథ్య గాయకుడిగా, “హనుమాన్” చిత్రం అత్యుత్తమ యానిమేషన్ & […]

32 ఏళ్ల తర్వాత షారుక్ ఖాన్‌కి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు…

కేంద్ర ప్రభుత్వం, 71వ జాతీయ సినీ అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది.. న్యూ ఢిల్లీలో జరిగిన ఈ వేడుకలో జాతీయ అవార్డులు గెలిచిన విజేతలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డుల ప్రధానం జరిగింది.. హిందీ, తెలుగు, తమిళ్, పంజాబీ, ఇతర భాషల్లో వివిధ విభాగాల్లో అవార్డులు గెలిచిన వారంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఈ సారి షారుక్ ఖాన్‌తో పాటు ‘10th Fail’ చిత్రానికి గాను విక్రాంత్ మాస్సే… జాతీయ ఉత్తమ నటుడిగా […]

‘OG’ మూవీ ప్రమోషనల్ కంటెంట్‌లో సిగరెట్‌తో సుభాష్ చంద్రబోస్!

‘Once more’ పేరుతో OG మూవీ థీమ్‌తో తయారుచేసిన ఆన్‌లైన్ గేమ్‌ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. మూడు విభాగాల్లో రూపొందిన ఈ గేమ్‌లో గెలిచిన వారికి OG మూవీ టికెట్లు గెలిచే అవకాశం ఉంటుందని చిత్ర యూనిట్ ప్రకటించింది.. కానీ ఈ గేమ్‌లో చూపించిన విజువల్స్‌లో సుభాష్ చంద్రబోస్ కనిపించడం అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఓజాస్ గంభీరకి, సుభాష్ చంద్రబోస్‌కి సంబంధం ఏంటి?  ఇలాంటి విషయాలు పక్కనబెడితే ఆజాద్ హింద్ ఫౌజీ దుస్తుల్లో ఉన్న సుభాష్ చంద్రబోస్, […]

‘ఓజస్ గంభీర’ వేరే లెవల్

పవర్ స్టార్ ఫ్యాన్స్ ఇటు మెగా ఫ్యాన్స్… మరోవైపు వరల్డ్ వైడ్‌గా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన అవెయిటెడ్ ‘OG’ ట్రైలర్ వచ్చేసింది. పవర్ స్టార్ గ్రేస్‌కు పదింతలు హైప్ ఇచ్చేలా ఉన్న గ్యాంగ్ స్టర్ డ్రామా ట్రైలర్ వేరే లెవల్‌లో ఉంది. ‘ముంబయికి వస్తున్నా… తలలు జాగ్రత్త’ అంటూ పవన్ చెప్పే డైలాగ్ వేరే లెవల్. ‘ఓజాస్ గంభీర నా…’ అంటూ పవన్ మాస్ యాక్షన్‌తో ఊగిపోతూ చెప్పడం ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ […]

నేను డిప్యూటీ సీఎం అనే సంగతే మర్చిపోయా: పవన్ కళ్యాణ్

ఓజీ సినిమాలో పోషించిన ఓజాస్ గంభీర గెటప్ లో పవన్ కళ్యాణ్ ఈ ఈవెంట్ కు వచ్చారు. సినిమాలో ఉపయోగించిన పెద్ద కత్తి పట్టుకొని స్టేజ్ మీదకి నడుచుకుంటూ వచ్చారు. ‘వాషి యో వాషి’ అనే డైలాగ్ చెప్పి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. తాను డిప్యూటీ సీఎం అనే సంగతి మర్చిపోయానని, అందుకే ఇలా కత్తి పట్టుకొచ్చానని అన్నారు. సుజిత్ వల్ల ఫస్ట్ టైమ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు సినిమా గెటప్ లో […]

అల్లు అర్జున్ లుక్ లీక్, అట్లీ సినిమాలో సూపర్ హీరోగా

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తన 22వ సినిమాను తమిళ స్టార్ దర్శకుడు అట్లీ కుమార్ దర్శకత్వంలో ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో అల్లు అర్జున్ లుక్ ఒకటి వైరల్ అవుతోంది. షూటింగ్ సెట్స్ లో తీసిన ఈ ఫోటోలో అల్లు అర్జున్ సూపర్ హీరో సూట్ ధరించి, జుట్టును ముడివేసిన స్టైల్‌లో కనిపిస్తున్నారు. ఈ లుక్‌ను చూసిన నెటిజన్లు హాలీవుడ్ రేంజ్‌లో బొమ్మ రాబోతుందని కామెంట్స్ చేస్తున్నారు. ఫ్యాన్స్ మాత్రం ఈ లుక్‌పై […]

‘మీ విజయాలు రాబోయే తరాలకు స్ఫూర్తి’.. మోహన్‌లాల్‌కు ప్రధాని మోడీ ప్రత్యేక అభినందనలు

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మలయాళ సూపర్ స్టార్ కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ‘మోహన్‌లాల్ బహుముఖ ప్రజ్ఞకు ప్రతీక.దశాబ్దాలుగా మలయాళ సినిమా ఇండస్ట్రీకి దివిటీలా నిలుస్తున్నారు. కేరళ సంస్కృతి పట్ల మక్కువ కలిగిన ఆయన కేవలం మలయాళమే కాకుండా, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లోనూ అద్భుతమైన పాత్రలు పోషించారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికైనందుకు ఆయనకు అభినందనలు . ఆయన సాధించిన విజయాలు రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలవాలి’ అంటూ ట్వీట్ లో రాసుకొచ్చారు […]

మోహన్‌లాల్‌కి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్

భారతీయ సినీ రంగంలో అత్యున్నత గౌరవంగా భావించే పురష్కారం ‘దాదాసాహెబ్ ఫాల్కే’. 2023 సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రముఖ మలయాళ నటుడు మోహన్‌లాల్‌కు ప్రకటించింది.నాలుగున్నర దశాబ్దాలుగా భారతీయ చిత్ర పరిశ్రమలకు ఆయన చేసిన సేవలను గుర్తించి ఈ ప్రతిష్టాత్మక అవార్డుతో సత్కరించనున్నారు. భారతీయ చలన చిత్రరంగానికి మోహన్‌లాల్‌ ఆదర్శవంతమైన సేవలను అందించారని.. ఆయన అద్భుతమైన ప్రతిభ, కృషి, పట్టుదల సినీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయమని కేంద్ర సమాచార శాఖ కొనిడియాడింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON