loader

ఇది పాకిస్తాన్ బ్రాండ్ కాదు.. మాకు అండగా నిలవండి.. కరాచీ బేకరీ యజమానుల ఆవేదన

భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతల నడుమ కరాచీ బేకరీపై దాడి జరిగింది. బజరంగ్‌దళ్ కార్యకర్తలు బేకరీ ఫర్నీచర్ ధ్వంసం చేసి, పేరు మార్చాలని హెచ్చరించారు. ఈ దాడులపై కరాచీ బేకరీ యజమాని వారసులు మీడియాతో మాట్లాడారు. ఈ కష్ట సమయంలో  అండగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డీజీపీ, కమిషనర్‌లను కోరారు. తాము హైదరాబాద్‌కు చెందిన వారమని.. ఇది పాకిస్తాన్ బ్రాండ్ కాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నిజమైన భారతీయ బ్రాండ్ కాబట్టి.. సాధారణ ప్రజలు […]

విశాఖలో లేడీ పోలీస్ ఆఫీసర్ స్వర్ణలత మరో ఘనకార్యం..

విశాఖపట్నంలో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ స్వర్ణలత మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో రెండు వేల నోట్ల మార్పిడి కేసులో అరెస్ట్ అయిన ఆమె, ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్‌ను బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన కేసులో పట్టుబడ్డారు. జైలుకు వెళ్లొచ్చినా రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ స్వర్ణలత బుద్ధి మాత్రం మారలేదు. తాజాగా ఆమె చేసిన మరో ఘనకార్యం బయటపడింది. తాజాగా స్వర్ణలత, సుధాకర్ కలిసి విశాఖపట్నంలో సబ్ రిజిస్ట్రార్‌ని బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారు..

ఎలివేటెడ్‌పై మరోసారి గ్రామసభలు

ఎలివేటేడ్‌ కారిడార్‌ భూసేకరణపై గ్రామసభలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. ప్యారడైజ్‌ నుంచి శామీర్‌పేట్‌ రింగ్‌రోడ్డు వరకు 18 కిలోమీటర్ల మేర నిర్వహించనున్న కారిడార్‌ నిర్మాణానికి  భూ సేకరణ పక్రియకు ఓ వైపు రక్షణ శాఖ కొర్రీలు, మరోవైపు స్థానికుల వ్యతిరేకతతో బ్రెక్‌ పడిన విషయం విదితమే. భూ సేకరణ పక్రియపై ఇదివరకు ప్రభుత్వం నిర్వహించిన గ్రామసభలను గ్రామస్తులు బహిష్కరించి న్యాయస్థానాలను ఆశ్రయించారు. తిరిగి ఈనెల 9న గ్రామాలకు సంబంధించిన గ్రామసభను లోతుకుంటలో రెవెన్యూ అధికారులు నిర్వహించనున్నట్లు […]

నాడు రక్షకభట నిలయం.. నేడు విజ్ఞాన కేంద్రం

1995లో తిర్యాణి మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను మావోయిస్టులు పేల్చివేశారు. దీంతో పోలీస్‌స్టేషన్‌ పాక్షికంగా దెబ్బతిన్నది. పేల్చివేతకు గురైన తిర్యాణి పోలీస్‌స్టేషన్‌ ఇప్పుడు యువతకు విజ్ఞానాన్ని అందించే లైబ్రరీగా మారింది. ఆసిఫాబాద్‌ ఏఎస్పీ చిత్తరంజన్‌ చొరవతో పోలీస్‌స్టేషన్‌ను లైబ్రరీగామార్చారు. ఈ ప్రాంతంలో ఉద్యోగాల కోసం సిద్ధమయ్యే నిరుద్యోగ గిరిజన యువతకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉంచుతున్నారు. గిరిజన యువతతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తూ వారిలో మార్పు తీసుకొస్తున్నారు.

ఒంగోలు వీరయ్య చౌదరి హత్యకేసులో మరో ట్విస్ట్!

ఏపీలో సంచలనంగా మారిన తెలుగుశేం పార్టీ నేత, ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి హత్యకేసు మిస్టరీ ఇంకా వీడలేదు. ఈ హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న నిందితలుకు సంబంధించి కూడా క్లారిటీ లేకుండా పోయింది. ముప్పవరపు వీరయ్య చౌదరికి రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్నవారు.. ఒంగోలుకు చెందిన యువకుడితో కలిసి ఈ హత్య చేయించినట్లు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. వీరయ్యచౌదరి హత్యకేసులో ఒంగోలుకు చెందిన యువకుడు ఎందుకు భాగస్వామి అయ్యాడనే చర్చ సాగుతోంది.

అల్లూరి జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో గత వారం రోజులనుంచి ఆపరేషన్ కగార్ లో భాగంగా మావోయిస్టుల అంతం కోసం భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా మరోవైపు ఎపిలో మావోయిస్టులు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని యు జీడిపాలెం పంచాయతీ పరిధిలో రెండు చోట్ల మావోయిస్టు కదిలికలను గుర్తించారు. మావోయిస్టులను గమనించిన పోలీసులు కాల్పులు జరుపగా, అప్రమత్తమైన మావోయిస్టులు ఎదురుకాల్పు జరిపి చివరి నిమిషంలో తప్పించుకున్నారు.

వైద్య ఆరోగ్యశాఖలో నకిలీ హాజరు..!

వైద్య ఆరోగ్యశాఖలో సమయపాలన పాటించి ప్రజలకు మెరుగైన సేవలందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకువచ్చిన ముఖ హాజరు గుర్తింపు (ఎఫ్‌ఆర్‌ఎస్‌) అభాసుపాలవుతోంది. ఉదాహరణకు ఓ ఉద్యోగి ఉదయం 9:30 గంటలకు వైద్యశాలకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఆ ఉద్యోగి ఉదయం 11 గంటలకు వెళ్లి ఐఫోన్‌లో టైమింగ్‌ సెట్టింగ్‌ ద్వారా ముఖ హాజరు వేసినా ఉదయం 9:30 గంటలకు హాజరైనట్లు నమోదవుతుంది. ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలన చేసి ప్రస్తుతం ఆ విధంగా ట్యాంపరింగ్‌ చేసిన వైద్యాధికారులు […]

సైకిల్‌పై వెళ్లి.. సమస్యలు తెలుసుకొని

మెదక్‌ కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ ఆదివారం ఉదయం తన భార్యతో కలిసి మెదక్‌ జిల్లాకేంద్రం నుంచి సైకిల్‌పై బయలుదేరి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామాయంపేట పట్టణానికి చేరుకున్నారు. స్థానిక బస్టాండ్‌ను సందర్శించి ప్రయాణికుల సమస్యలు అడి గి తెలుసుకున్నారు. బస్టాండ్‌లో  మహిళా ప్రయాణికులతో మాట్లాడి మహాలక్ష్మి పథకం అమలు గురించి ఆరాతీశారు. అనంతరం తన సతీమణితో కలిసి బస్సు లో టికెట్‌ తీసుకొని మెదక్‌కు ప్రయాణించారు. ఇటీవల కలెక్టర్‌ దంపతులు పొలాలను సందర్శించి వరినాట్లు వేశారు.

న్యాక్‌ ఇంజినీర్లపై వేటు

జీహెచ్‌ఎంసీలో 27 మంది నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్స్‌(న్యాక్‌) ఇంజినీర్లపై వేటు వేస్తూ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఇలంబర్తి ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. అక్రమ నిర్మాణాల విషయంలో న్యాక్‌ ఇంజినీర్లు డబ్బులు తీసుకున్నట్లు కమిషనర్‌కు పలువురు బాధితులు స్వయంగా ఫిర్యాదు చేశారు. విజిలెన్స్‌ విభాగాన్ని రంగంలోకి దింపి సమగ్ర విచారణకు ఆదేశాలు జారీశారు. జీహెచ్‌ఎంసీ వ్యాప్తంగా 100 మంది న్యాక్‌ ఇంజినీర్లు ఉండగా, ప్రధానంగా 27 మంది అవినీతికి పాల్పడినట్లు విచారణలో తేలింది. ఈ మేరకు విధుల నుంచి తొలగిస్తూ […]

స్పీకర్‌పై సుప్రీం అసహనం

బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల అనర్హతపై మరోసారి సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ప్రభుత్వ వైఖరిపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీ, ఎన్నికల సంఘం, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. మార్చి 22 వరకూ సమా ధా నం ఇవ్వాలని ఆదేశించింది. ప్రతిసారీ రీజనబుల్ టైమ్ కావాలని ప్రభుత్వం కోరుతుండటంతో సుప్రీంకోర్టు మండిపడింది. రీజనబుల్ టైమ్ అంటే గడువు ముగిసే వరకా అని అసహనం వ్యక్తం చేసింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON