1971 జనాభా లెక్కల ప్రకారమే కేంద్రం డీలిమిటేషన్ ప్రక్రియ చేపడుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. కేంద్రం రెండు బిల్లులకు ఆమోదం తెలిపిన సందర్భంగా సీఎం చంద్రబాబు ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. డీలిమిటేషన్లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయొద్దని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. కాంగ్రెస్ కోరుతున్నట్లు డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు. విపక్షాలు ఎందుకు ఇంకా రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. 30 ఏళ్లుగా మహిళలకు రిజర్వేషన్లు కల్పించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.