మహిళా కలెక్టర్కు అసభ్యకరమైన సందేశాలు పంపిన కేసులో తమిళనాడు అధికార పార్టీ ఎమ్మెల్యే అరుళ్ విఘ్నేశ్ అరెస్టయ్యారు. వేధింపులకు సంబంధించి మహిళా కలెక్టర్ ఇటీవల ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మూడు రోజుల క్రితం కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. మరోవైపు, ఈ వ్యవహారంపై దర్యాప్తును ఐజీ స్థాయి అధికారి పర్యవేక్షించాలని మద్రాస్ హైకోర్టు ఇటీవల ఆదేశించిన విషయం తెలిసిందే.అన్నాడీఎంకేకు చెందిన ఓ న్యాయవాది.. మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.