సోషల్ మీడియా దిగ్గజ సంస్థ మెటాతో కాంగ్రెస్ పార్టీ వివాదం మరింత ముదిరింది. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు రాహుల్ గాంధీ పేరుతో లేదా ఆయన ఫొటోలతో పెట్టే పోస్టులను మెటా సంస్థ ఉద్దేశపూర్వకంగా బ్లాక్ చేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. రాహుల్ గాంధీ పేరుతో, ఆయన ఫొటోలతో సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వాటిని మెటా ఆటోమేటిక్ విధానంలో గుర్తించి బ్లాక్ చేస్తోందని పిటిషన్లో పేర్కొంది. పుట్టినరోజు శుభాకాంక్షలు, నివాళులు, పెళ్లి ఆహ్వాన పత్రిక వంటి సాధారణ పోస్టులు కూడా తొలగింపునకు గురయ్యాయని కాంగ్రెస్ అసహనం వ్యక్తం చేసింది