సీజేపీ నేత సౌరవ్ దాస్ తన జన్మస్థలం గురించి స్పష్టత ఇవ్వాలని చెన్నైలోని ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయం కోరింది. ఆయన సమాధానం ఇచ్చే వరకు పాస్‌పోర్ట్‌ను ఉపయోగించవద్దని సూచించింది. ఈమేరకు వివరాలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జయస్వాల్ వెల్లడించారు. నవంబర్ 23న పాస్ పోర్ట్ కార్యాలయం సౌరవ్ కు షో-కాజ్ నోటీసు జారీ చేసిందని చెప్పారు. పాస్ పోర్ట్ దరఖాస్తుదారులు కచ్చితమైన సమాచారాన్ని అందించాల్సి ఉంటుందని, వాస్తవాలను దాచిపెట్టినట్లు గుర్తిస్తే నోటీసు జారీ చేస్తారని పేర్కొన్నారు.

