హైదరాబాద్ జరుగుతున్న పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో -2026 లో సీఎం రేవంత్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పౌల్ట్రీ పరిశ్రమ సమస్యలను పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. అనుమతులు త్వరగా మంజూరు చేయడానికి సింగిల్ విండో విధానం తీసుకొస్తామన్నారు. సమావేశాలు, సదస్సుల కోసం కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేసుకోవడానికి వీలుగా ఫ్యూచర్ సిటీలో స్థలం కేటాయిస్తామన్నారు. ఇందుకోసం గ్లోబల్ సమిట్ వేదికగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇవ్వాలని సూచించారు. దాణా సమస్యను కూడా పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.

