విజయనగరం జిల్లా భోగాపురం మండలం సుందరపేట సమీపంలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న థార్ కారు రోడ్డుపై ఆగి ఉన్న లారీ ట్యాంకర్ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరొకరిని స్థానికులు వెంటనే సుందరపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.