హైదరాబాద్ మెట్రోకు కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. రెండో దశ నిర్మాణానికి అందించాల్సిన రుణంపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చేతులెత్తేశారు. దాని గురించి తనకు తెలియదని.. రుణ అంశం తన పరిధిలోనే లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ నిర్మాణానికి ఇండియన్ రైల్వే ఫైనాన్సింగ్ కార్పొరేషన్ (IRFC) ద్వారా రుణాలు సేకరించాలనే ప్రతిపాదన తమ వద్ద లేదని కుండబద్దలు కొట్టారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం కొద్ది నెలలుగా చేస్తున్న ప్రయత్నాలు విఫలమైనట్లే కనిపిస్తోంది.

