మంచు విష్ణు బర్త్ డే సందర్భంగా ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త సినిమాకు సంబంధించిన విషయాలను పంచుకున్నారు ప్రభుదేవా. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ లో వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటోను కూడా పంచుకున్నారు. దాంతో ఈ క్రేజీ కాంబోపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.