నేపాల్ ప్రధాని బాలెన్ షా కలిసి జెండా ఊపి అయోధ్య-జానకీ ధామ్ రైలును ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య ధామ్‌ను నేపాల్‌లోని జనక్‌పూర్ ధామ్తో కలిపే ‘సరయూ కమలా ఎక్స్‌ప్రెస్’ అనే కొత్త రైలు సర్వీసును ఇరు దేశాల ప్రధానులు జెండా ఊపి వర్చువల్‌గా ప్రారంభించారు. వారంలో ఒకసారి నడిచే ఈ రైలు ఉత్తర ప్రదేశ్, బీహార్, నేపాల్‌లోని ముఖ్య గమ్యస్థానాలను కలుపుతుంది. గోరఖ్‌పూర్, బస్తీ, రక్సౌల్, సీతామర్హి, మధుబని, జయనగర్ స్టేషన్లలో ఇది ఆగుతుంది.