ఆఫ్రికా దేశమైన లిబియా తీరంలో రష్యాకు చెందిన ఓ చిన్నపాటి యుద్ధనౌకను ముంచేయడంతోపాటు మరో సరకు రవాణా నౌకపై దాడి చేసినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ‘ఎక్స్’ వేదికగా విడుదల చేశారు. నష్టనివారణకు శత్రు దేశం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తమ భద్రతా సంస్థల సేవలను ప్రశంసించారు. సీ డ్రోన్లు వెళ్లి నౌకలను ఢీకొట్టి పేలిపోవడం, పెద్దఎత్తున మంటలు ఎగసిపడటం వంటి దృశ్యాలు జెలెన్స్కీ పోస్ట్ చేసిన వీడియోలో కనిపించాయి.