భారత పర్యటనలో భాగంగా నేపాల్ ప్రధాన మంత్రి బాలేంద్ర షా ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాల పునరుద్ధరణపై చర్చించారు. అనంతరం భారత్, నేపాల్ ప్రధానులు ఉమ్మడి మీడియా సమావేశంలో మాట్లాడారు. భోటేకోషి విపత్తు తర్వాత నేపాల్లో అభివృద్ధి పనులకు 24,000 కోట్ల నేపాలీ రూపాయల ప్యాకేజీని ప్రధాని మోదీ ప్రకటించారు. ఇరు దేశాల మధ్య పర్యాటక ప్రోత్సాహానికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.