ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్ బిస్లెరీ FSSAI కేసుపై Bisleri స్పందించింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న విషయం దాదాపు 14 నెలల క్రితం నాటిదని కంపెనీ స్పష్టం చేసింది. గత ఏడాది సెప్టెంబర్ 30న FSSAI బృందం గోవా ప్లాంట్ నుంచి మొత్తం 6 శాంపిల్స్ సేకరించిందని, వాటిలో 5 నమూనాలు అన్ని నాణ్యతా ప్రమాణాలకు పూర్తిగా అనుగుణంగా ఉన్నాయని క్లారిటీ ఇచ్చింది. కేవలం ఆరో నమూనా ప్రాథమిక పరీక్షలో మాత్రమే బ్రోమేట్ (Bromate) స్థాయి లీటరుకు 12 మైక్రోగ్రాములుగా గుర్తించారు.