loader

కార్తికమాసం రెండో సోమవారం సందర్భంగా ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఉదయాన్నే ఆలయాలకు వెళ్లి కార్తిక దీపాలు వెలిగించారు. భక్తుల రాకతో పలు చోట్ల రద్దీ నెలకొంది. శివనామస్మరణతో ఆలయాలు మారుమోగాయి. ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలానికి భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తుల రాక పెరగడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. వేకువ జాము నుంచే పాతాళ గంగలో పుణ్య స్నానాలు ఆచరించి.. కార్తీక దీపాలు వెలిగించి గంగమ్మకు భక్తిశ్రద్ధలతో మొక్కులు సమర్పిస్తున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON