ప్రధాని నరేంద్ర మోదీ బిహార్లోని వైశాలి జిల్లాలో కచ్చీ దర్గా-రాఘవ్పూర్-బిడుపుర్ బ్రిడ్జిని ప్రారంభించారు. ఆరు లేన్లు ఉన్న ఈ బ్రిడ్జికి బిహార్ మాజీ సీఎం నితీశ్ కుమార్ గౌరవార్థం ‘నితీశ్ సేతు’ అని పేరుపెట్టారు నితీశ్ సేతు బ్రిడ్జిని రూ.4,280 కోట్లతో గంగా నదిపై నిర్మించారు. పూర్తిగా కేబుళ్లతో దీనిని కట్టారు. దీని పొడవు 19.7 కిలోమీటర్లు. పట్నా జిల్లాలోని జాతీయ రహదారి 22పై ఉన్న కచ్చీ దర్గాను వైశాలి జిల్లాలోని జాతీయ రహదారి 322పై ఉన్న బిడుపుర్తో ఈ బ్రిడ్జి కలుపుతుంది.