తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చలి గాలుల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. సంగారెడ్డి జిల్లాలో చలి ప్రభావం అత్యధికంగా కనిపిస్తోంది. జిల్లాలోని సత్వార్‌లో 9.6 డిగ్రీలు, కోహీర్‌లో 9.7 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవగా, న్యాల్కల్ మరియు ఝరాసంగం ప్రాంతాల్లో 10 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. అలాగే కామారెడ్డి జిల్లా డోంగ్లిలో 10.5 డిగ్రీలు, వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మరియు ధారూర్ మండలాల్లో 11 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.