ప్రతిష్ఠాత్మక ‘పీఎం స్వనిధి సమ్మాన్ అవార్డ్స్-2026’లో తెలంగాణ ‘ఫాస్టెస్ట్ మూవర్ స్టేట్’ (అత్యంత వేగంగా పురోగతి సాధించిన రాష్ట్రం) పురస్కారాన్ని కైవసం చేసుకుంది. శుక్రవారం న్యూఢిల్లీలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఈ అవార్డులను అధికారికంగా ప్రకటించారు.
చిరు వ్యాపారుల జీవనోపాధిని మెరుగుపరచడం, వారికి సులభతరంగా బ్యాంకు రుణాలు అందేలా చూడటం, అలాగే డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడంలో తెలంగాణ ప్రభుత్వం చూపిన చొరవకు ఈ గుర్తింపు లభించింది.