యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కార్తీకోత్సవ వేడుకల ఏర్పాట్ల సందర్భంగా అపశృతి చోటుచేసుకుంది. కార్తీకోత్సవాల కోసం ఆలయ ఉత్తర మాడ వీధిలో ఏర్పాటు చేసిన వైట్ పెండర్ టెంట్ భక్తులపై కూలిపోవడంతో భక్తులు గాయపడ్డారు. ఈ ఘటనలో సుమారు 10 మంది గాయపడినట్లు సమాచారం. వెంటనే స్పందించిన సిబ్బంది, స్థానికులు క్షతగాత్రులను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆలయ పరిసరాల్లో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. టెంట్ కూలడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.