బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుపాను తన రూట్ మార్చుకుంది.సముద్రంలోనే కొంత బలహీనపడి దక్షిణ ఒడిశా వైపు కదులుతోంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, బలమైన గాలుల ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలోని ఉప ఉష్ణమండల అధిక పీడన ప్రభావంతోనే ఈ గమన మార్పు జరిగిందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. గతంలోనూ చాలా తుఫాన్లు ఇలాగే దిశ మార్చుకున్నాయని గుర్తు చేశారు. కోల్కతా లేదా బంగ్లాదేశ్ తీరం వైపు వెళ్లే ఛాన్స్ కూడా ఉందని అంచనా వేస్తున్నారు.