మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో పర్యటిస్తున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. సోమవారం ఆ దేశాధ్యక్షుడు ఫెర్డినాండ్ ఆర్.మార్కోస్ ఏర్పాటు చేసిన గాలా డిన్నర్‌కు హాజరయ్యారు. ఈ విందులో ప్రధాని మోదీ ఫిలిప్పీన్స్ జాతీయ, సాంప్రదాయ అధికారిక పురుషుల వస్త్రధారణ అయిన బరోంగ్ తగలాగ్ దుస్తులను ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నావిగేటింగ్ ది ఫ్యూచర్ అనే థీమ్‌తో నిర్వహిస్తున్న 49వ ఆసియాన్, అనుబంధ శిఖరాగ్ర సదస్సులకు హాజరైన దేశాల అధినేతల గౌరవార్థం ఈ విందును ఏర్పాటు చేశారు.