రష్యా- ఉక్రెయిన్ మధ్య భీకర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా రష్యాపై ఉక్రెయిన్ అతిపెద్ద వైమానిక దాడిని చేపట్టింది. 1,336 డ్రోన్ లతో రష్యాపై విరుచుకుపడింది. ఈ దాడికి సంబంధించిన వివరాలను రష్యా డిఫెన్స్ మినిస్ట్రీ తాజాగా వెల్లడించింది. ఇరు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యాపై ఉక్రెయిన్ జరిపిన అతిపెద్ద వైమానిక దాడి ఇదేనని పేర్కొంది. రష్యా బలగాలు ఒక్కరాత్రిలోనే ఏకంగా ఉక్రెయిన్ నుంచి వచ్చిన 1,336 డ్రోన్ లను కూల్చేసినట్లు స్పష్టం చేసింది.