హైదరాబాద్లో ఇటీవల నిర్వహించిన భారత్ సమ్మిట్లో ఇటలీకి చెందిన రాజకీయ నేత ఫిలిబెక్ చేసిన వ్యాఖ్యల వ్యవహారంపై తెలంగాణ బీజేపీ నేతలు ఆశించిన స్థాయిలో స్పందించలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. విదేశీ రాజకీయ నేత భారతదేశానికి వచ్చి దేశీయ రాజకీయాలపై వ్యాఖ్యలు చేస్తుంటే రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఎందుకు సమర్థంగా స్పందించలేదని ఆయన ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని తేలిగ్గా తీసుకోకుండా తక్షణమే సంబంధిత పోలీసు అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించినట్లు సమాచారం.