సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఢిల్లీలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాహుల్, ప్రియాంకా, తమిళనాడు సీఎం విజయ్ తో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు కూడా తరలివచ్చారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి , ఇండియా కూటమి నేతలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ , ప్రియాంకల ఒత్తిడితోనే ఆత్మథ రాసినట్లు తెలిపారు. పుస్తకాలను ఆవిష్కరించి కాంగ్రెస్ నేతలకు, అతిథులకు అందించారు