అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. తమ ప్రతిష్టాత్మక ‘డ్రాగన్‌ఫ్లై’ మిషన్ ద్వారా సామాన్య ప్రజలు తమ పేరును శని గ్రహానికి అతిపెద్ద ఉపగ్రహమైన ‘టైటాన్’ పైకి పంపే ఛాన్స్‌ను ఇచ్చింది. అందుకోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది.
పేరును రిజిస్టర్ చేసుకున్న వారి పేర్లన్నీ ఒక చిన్న మైక్రోచిప్‌లో భద్రపర్చి, దాన్ని డ్రాగన్‌ఫ్లై అంతరిక్ష నౌక ద్వారా టైటాన్‌కు పంపనుంది. అధికారిక వెబ్‌పేజీ https://my.nasa.gov/specialevents/s/send-your-name-with-dragonfly