తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నూతన వైస్ చైర్మన్ , వీసీ అండ్ ఎండీగా సీనియర్ ఐపీఎస్ అధికారి డాక్టర్ అనిల్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన ఐపీఎస్ అధికారుల బదిలీల్లో ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా సేవలందించిన వై. నాగిరెడ్డిని ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ కమిషనర్గా బదిలీ చేసింది. ఆయన స్థానంలో పోలీస్ శాఖలో గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభాగాల డైరెక్టర్ గా విధులు నిర్వహించిన డాక్టర్ అనిల్ కుమార్ ను ప్రభుత్వం నూతన ఆర్టీసీ ఎండీగా నియమించింది.