అమెరికాలో హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులపై న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం న్యూయార్క్‌లోని క్వీన్స్ ఓం శక్తి ఆలయంలో నిర్వహించిన దుర్గాపూజ వేడుకల్లో మమ్దానీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇల్లినాస్లో హిందూ ఆలయాలపై జరిగిన సామూహిక కాల్పుల ఘటనపై స్పందించారు. హిందూ అమెరికన్లు ఎలాంటి భయం లేకుండా ప్రశాంతంగా, సురక్షితంగా పూజలు చేసుకునే హక్కు ఉందని ఆయన స్పష్టం చేశారు. అందుకు తగిన వాతావరణం కల్పించడం అందరి బాధ్యత అన్నారు.