జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేటలో కొలువైన ప్రసిద్ధ కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో అరుదైన ఆధ్యాత్మిక ఘట్టానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు ఆరు దశాబ్దాలుగా స్వామివారి మూలమూర్తిపై పూస్తున్న చందనపు పొరలను తొలగించి, భక్తులకు నిజరూప దర్శనం కల్పించేందుకు ఆలయ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం నవంబర్ 15 నుంచి 20వ తేదీ వరకు చందనోత్సారణ, మహా సంప్రోక్షణ మహోత్సవాలను నిర్వహించనున్నారు. మూలవిరాట్టుకు పూస్తున్న చందనాన్ని ప్రత్యేక పద్ధతిలో తొలగించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత స్వామివారి నిజరూపం భక్తులకు కనువిందు చేయనుంది.