నిర్మల్ జిల్లా కేంద్రంలోని సోఫీనగర్ సమీపంలో WagonR కారులోని ఎల్పీజీ కిట్ లీకేజీ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి కారులో ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్రంగా గాయపడ్డాడు. పట్టణంలోని నటరాజ్ నగర్ కి చెందిన రవి అనే మెకానిక్ వ్యాగనార్ కారులో సోఫీనగర్ వైపు నుంచి నిర్మల్ కు వస్తుండగా మార్గమధ్యలో కారులోని ఎల్పీజీ కిట్ నుంచి గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో కారులో ఉన్న రవికి మంటలు అంటుకున్నాయి. అప్రమత్తమైన రవి చాకచక్యంగా కారు నుంచి బయటకు వచ్చాడు.కారు పూర్తిగా దగ్ధమైంది.