అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. వాషింగ్టన్ డీసీ లోని లోగన్ సర్కిల్ వద్ద ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో నలుగురు అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు తెలిపారు. పదుల సంఖ్యలో గాయపడినట్లు వివరించారు. కాల్పులు జరిగిన ప్రాంతం వైట్ హౌస్ కు కొద్ది దూరంలోనే ఉండటంతో సెక్యూరిటీ మరింత అప్రమత్తమయ్యారు. ఈ ఘటన జరిగిన సమయంలో
అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌస్ లో లేరని తెలుస్తోంది. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టి ఆగంతకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.