నేపాల్‌లోని బాగ్మతి ప్రావిన్స్‌లో గురువారం కొండ రహదారిపై మైక్రోబస్ అదుపుతప్పి లోయలో పడిన ఘటనలో 11 మంది మృతిచెందారు. మరో ఆరుగురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. మకవాన్‌పూర్ జిల్లాలో ఉదయం 5.45 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సుమారు 17 మందితో ఖాట్మండు నుంచి సర్లాహీకి వెళ్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. వాహనం సుమారు 300 మీటర్లు కిందికి జారిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో సహా 11 మంది మృతిచెందారు. గాయపడిన ఆరుగురు ప్రయాణికులను చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు.