పోలీస్ శాఖలో ప్రభుత్వం 21 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. రాజధాని హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు కొత్త సారథిని ప్రభుత్వం నియమించింది. ఇప్పటివరకు డీజీపీ (లా అండ్ ఆర్డర్) బాధ్యతలు నిర్వర్తించిన 1995 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి మహేశ్ మురళీధర్ భగవత్‌ను హైదరాబాద్ నగర కొత్త సీపీగా ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. వీసీ సజ్జనార్: డీజీ (తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ & సివిల్ డిఫెన్స్), ఎస్పీఎఫ్ డీజీగా అదనపు బాధ్యతలు

