ఎమ్మెల్సీ అప్పిరెడ్డిపై తప్పుడు కేసు పెట్టారు. అప్పిరెడ్డికి రక్షణ కల్పించలేనని జైలు సూపరింటెండెంట్ లెటర్ రాశారు. రక్షణ కల్పించలేకపోతే మీరెందుకు గుడ్డి గుర్రం పళ్లు తోముతారా? బ్యాలెట్ బాక్సు ఎందుకు బస్సులో నుంచి కిందకు దించారు?. బ్యాలెట్ బాక్సు వెంట పోలీసులు ఎందుకు లేరు. ఇప్పటివరకూ ఒక్కరైనా సమాధానం చెప్పారా?. అప్పిరెడ్డికి జైల్లో ఎలాంటి సౌకర్యాలు లేవు. రెండు బారికేడ్ల అవతల అప్పిరెడ్డిని చూపించారు. గుంటూరు జైల్లో చట్టం ప్రకారం ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తికి కల్పించవలసిన సౌకర్యాలు కూడా కల్పించలేదు.