AIMIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఆజాద్ సమాజ్ పార్టీ కాన్షీరాం అధ్యక్షుడు, నగీనా ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్ అధికారికంగా రాజకీయ పొత్తును ప్రకటించారు. లక్నో వేదికగా వీరిద్దరూ సంయుక్త మీడియా సమావేశం నిర్వహించి యూపీలో కొత్తగా సామాజిక పరివర్తన మోర్చా పేరిట మూడో కూటమికి తెరలేపారు. ఇండియా కూటమిలో తమకు స్థానం కల్పించాలంటూ సమాజ్‌వాదీ పార్టీ,
కాంగ్రెస్‌లకు ఒవైసీ ఇచ్చిన గడువు ముగియడం, అఖిలేష్ యాదవ్ మొండిచేయి చూపడంతో.. ఒవైసీ నేరుగా చంద్రశేఖర్ ఆజాద్‌తో జట్టుకట్టి యూపీలో ‘దళిత-ముస్లిం’ కాంబినేషన్‌ను సెట్ చేశారు.