ఏపీలో టూరిజం, సెమీకండక్టర్, గ్రీన్ఫీల్డ్ పోర్టులు, పునరుత్పాదక ఇంధనంతో పాటు మరెన్నో రంగాల్లో అపార అవకాశాలు ఉన్నాయన్ని వాటిని పెట్టుబడిదారులు వినియోగించుకోవాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. విశాఖ సీఐఐ సదస్సులో పాల్గొన్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. 8 సీఐఐ భాగస్వామ్య సదస్సులు నిర్వహించామన్న సీఎం, తమపై నమ్మకంతో ఎందరో పెట్టుబడిదారులు రాష్ట్రానికి వచ్చినట్లు వివరించారు. ఇప్పటి వరకు 32.49 లక్షల కోట్ల రూపాయల విలువైన ఎంవోయూలు కుదుర్చుకున్నామని సీఎం స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఎన్నో కొత్త సంస్కరణలు తీసుకురాబోతున్నట్లు వివరించారు.