తెలంగాణలో మైనార్టీ సంక్షేమం విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీ, కేంద్రం హోం మంత్రి అమిత్ షా మైనార్టీల సంక్షేమాన్ని పట్టించుకోరని మండిపడ్డారు. మైనార్టీలకు వచ్చే స్కాలర్ షిప్ లను మోదీ రద్దు చేశారని.. స్కాలర్ షిప్ రద్దుతో మైనార్టీ విద్యార్థులకు అన్యాయం చేశారని సీఎం ఘాటు వ్యాఖ్యలు చేశారు. మైనారిటీల్లో చాలామంది స్కిల్డ్ యూత్ ఉన్నారని.. యువత కోసమేతమ ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చిందని చెప్పుకొచ్చారు.

