ముంబై సబర్బన్ రైలు ప్రయాణికుల భద్రత కోసం ఆటోమేటిక్ డోర్లతో కూడిన మొట్టమొదటి నాన్-ఏసీ లోకల్ రైలును భద్రతా పరీక్షల కోసం ముంబైకి పంపింది. 12 కోచ్లు ఉన్న ఈ రైలును చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ తయారు చేసింది. ఈ రైలు కదులుతున్నప్పుడు డోర్లు వాటంతట అవే మూసుకుంటాయి, కేవలం రైల్వే స్టేషన్లలో ఆగినప్పుడు మాత్రమే తెరుచుకుంటాయి.
గతేడాది జూన్ లో ముంబ్రా సమీపంలో జరిగిన ఘోర రైలు ప్రమాదం ఈ కొత్త రైలు రూపకల్పనకు ప్రధాన కారణంగా నిలిచింది.

