కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలకు విద్య, ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్లు కల్పించిందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. సచార్ కమిటీ సూచన మేరకు మైనార్టీలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించిందన్నారు. దీంతో మైనార్టీలకు విద్య, ఉద్యోగ అవకాశాలు పెరిగాయని తెలిపారు. బంజారాహిల్స్‌లో జాతీయ విద్యా, మైనారిటీల సంక్షేమ దినోత్సవంలో సీఎం పాల్గొన్నారు. మైనార్టీశాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆ శాఖ మంత్రి అజారుద్దీన్‌తో కలిసి పరిశీలించారు. మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్ తొలగించాలని బీజేపీ డిమాండ్ చేస్తోందని సీఎం చెప్పారు. గుజరాత్లో కూడా మైనార్టీలకు రిజర్వేషన్ అమలు చేస్తున్నారని, మరి అక్కడెందుకు తొలగించడం లేదని నిలదీశారు.

