భారతరత్న, షెహనాయ్ దిగ్గజం ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ నివాసంలోని కొంత భాగం కూల్చివేయడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఈ ఘటనపై బీజేపీని తీవ్రంగా విమర్శించారు. కళాకారుల వారసత్వాన్ని ధ్వంసం చేయడం దేశ గౌరవాన్ని దెబ్బతీయడమేనని వ్యాఖ్యానించారు. దేశానికి గర్వకారణమైన కళాకారుడి వారసత్వాన్ని కాపాడాల్సింది పోయి.. ఆయన ఇంటినే కూల్చివేయడం దురదృష్టకరమని మండిపడ్డారు. అయితే ఈ కూల్చివేతలో తమకు ఎలాంటి సంబంధం లేదని,కుటుంబ సభ్యులే స్వచ్ఛందంగా ఇంటిని తొలగిస్తున్నారని వారణాసి కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు.