కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మందికి రాష్ట్రప్రభుత్వం దీపావళి కానుక ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నర లక్షల మందికి కొత్తగా చేయాత పింఛన్ల మంజూరు ప్రక్రియను కొడంగల్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. హకీంపేటలో మహిళా సంఘాలతో సమావేశమైన సీఎం, కొత్త పించనుదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ నెల 19 ఇందిరాగాంధీ జయంతి రోజున ఖాతాల్లో పింఛన్లు జమ కానున్నాయి