తుఫాన్ బాధితులకు అండగా ఉంటామని, అధైర్యపడవద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భరోసా కల్పించారు. మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఈరోజు సీఎం పర్యటిస్తున్నారు. బాపట్ల జిల్లాలోని జిల్లెళమూడిలో నీట మునిగిన వరి పంటను ముఖ్యమంత్రి పరిశీలించారు. నీట మునిగి పంట నష్టపోయిన రైతులతో సీఎం మాట్లాడి ధైర్యం చెప్పారు. పంటలపై అన్నదాతలు ఎంతమేర పెట్టుబడులు పెట్టారని అడిగి తెలుసుకున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో తుఫాన్ దెబ్బ తీసిందంటూ ఆవేదనతో సీఎంకు పరిస్థితిని రైతన్నలు వివరించారు.