బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ నివాసం (జల్సా)తో పాటు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ ఆఫీసు (BSE), వర్లీ రేస్ కోర్సు, బాంబే హైకోర్టులకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు నగరవ్యాప్తంగా అలర్ట్ ప్రకటించారు. బెదిరింపులు వచ్చిన ప్రదేశాల్లో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. బెదిరింపు ఈ-మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందన్న వివరాలను గుర్తించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ప్రస్తుతానికి తనిఖీల్లో అనుమానాస్పద వస్తువులు లభించలేదని అధికారులు వెల్లడించారు. మూడు వారాల వ్యవధిలో అమితాబ్ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడడం ఇది రెండోసారి.